రజనీకాంత్ మద్దతు కోరుతా
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి మద్దతివ్వాలని సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కోరుతానని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తెలిపారు. ఒక వేళ రజనీ తమకు మద్దతిస్తే కార్యకర్తలకు మంచి ప్రోత్సహం ఇచ్చినట్లవుతుందన్నారు. రజనీ తనకు మంచి స్నేహితుడు అని పేర్కొన్నారు. తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికలు నిజాయితీకి, అవినీతికి మధ్య జరిగేవి అని అన్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా రజనీకాంత్ పార్టీ ఏర్పాటును నిలిపి వేసిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టకూడదన్న రజనీకాంత్ నిర్ణయం ఆయన అభిమానులలాగే తననూ తీవ్ర నిరాశకు గురి చేసిందని కమల్ హాసన్ గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే.













