‘జాన్’కి అతిథి కాజల్ అగర్వాల్
జాన్ కి అతిథి కాబోతున్నారట కాజల్ అగర్వాల్. ప్రభాస్ హీరోగా ఎస్.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం జాన్ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. 1970 పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలో నటించబోతున్నారని తాజా సమాచారం. ఇంతకుముందు మిస్టర్ పర్ఫెక్ట్ (2011) సినిమాలో ప్రభాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.













