కాజల్ కు మరో బంపర్ ఆఫర్
తమిళ కథానాయకుడు విజయ్ సరసన మరోసారి నటించే బంపర్ ఆఫర్‌ని కాజల్ అందుకున్నట్టు సమాచారం. విజయ్, ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందబోయే తుపాకీ సీక్వెల్లో నాయికగా కాజల్‌ని ఎంపిక చేశారట. తుపాకీ లోనూ విజయ్, కాజల్ జోడీ ప్రేక్షకుల్ని మస్మరైజ్ చేసిన విషయం విదితమే. ఓ పక్క విజయ్‌తోనూ మరో పక్క చిరంజీవితోనూ నటించటానికి కాజల్ రెండు రోజుల గ్యాప్‌తో రెండు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం విశేషం. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఆచార్య లోనూ కాజల్ ఎంపికైంది. ముంబాయి సాగా, ఇండియన్ 2 చిత్రాల్లోనూ నటిస్తోంది. మొత్తమ్మీద కాజల్ నటిస్తున్న 4 చిత్రాలూ భారీ చిత్రాలే కావడం మరో విశేషం.













