డిఫరెంట్ యాంగిల్ లో ఎన్టీఆర్ ను ప్రజెంట్ చేయనున్న కొరటాల శివ
ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్న కొత్త సినిమాలో ఆయన క్యారెక్టర్‌కి సంబంధించిన అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ గతంలో ఎన్నడూ చుడని విధంగా ఉండనుందట. చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో స్ట్రాంగ్ డైలాగ్ డెలివరీతో థియేటర్లలో ప్రేక్షకుల చేత గోల పెట్టించడం ఎన్టీఆర్ స్టైల్. అలాంటిది తొలిసారిగా యంగ్ టైగర్ని అమాయక చక్రవర్తి గా చూపించ బోతున్నారట డైరెక్టర్ కొరటాల శివ. ప్రస్తుతం ఈ విషయం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో ఓ మూవీ రాబోతున్న ఇటీవలే ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసేశారు. అయితే తాజాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ విషయమై ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అమాయక చక్రవర్తిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.
సామాజిక కోణాల్లో సినిమాలు తీస్తూ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో తనదంటూ ప్రత్యేక శైలి అని నిరూపించుకున్న కొరటాల శివ ఈ సినిమా కోసం డిఫరెంట్ స్కెచ్ వేశారట. పల్లెటూరిలో అమాయకంగా తిరిగే ఓ వ్యక్తి ఒకానొక సందర్భంలో సిటీకి వెళ్లాల్సి రావడం.. అక్కడ అతను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల అప్పటి నుంచి ఆయన ఎలా మారతాడు? అనే పాయింట్ తీసుకొని ఎన్టీఆర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారట కొరటాల. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మూవీ నందమూరి అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చింది. దీంతో మరోసారి ఈ కాంబో మూవీ రానుండటం జనాల్లో ఆసక్తి పెంచేసింది. ఇకపోతే ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్గా తీసుకున్నారని తెలుస్తోంది. అతి త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ఇప్పటికే వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్.













