నా పెళ్లి అక్కడే జరుగుతుంది
పెళ్లంటూ చేసుకుంటే తిరుపతిలోనే చేసుకుంటానని అంటున్నారు శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్. ప్రస్తుతం ఆమె గుంజన్ సక్సెనా- ది కార్గిల్ గర్ల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత జీవితం గురించి, పెళ్లి గురించి ఓ ప్రముఖ మ్యాగజైన్‌తో మాట్లాడారు. నా పెళ్లి నాకు కావాల్సిన వారి సమక్షంలో జరగాలి. అంతారియలిస్టిక్గా అనిపించాలి. అయితే భారీగా, హంగామాతో మాత్రం ఉండకూడదు. నా పెళ్లి ఎటూ ఎంతో సంప్రదాయబద్ధంగా జరుగుతుందని తెలుసు. నేను పెళ్లంటూచేసుకుంటే తిరుపతిలోనే చేసుకుంటాను. పెళ్లికి కాంజీవరం జరీచీర కట్టుకుంటాను. పెళ్లాయ్యాక నాకు ఎంతో ఇష్టమైన దక్షిణాది వంటకాలు ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం, పాయనంతో ఘనంగా విందు ఇస్తాను అన్నారు.













