జాతిరత్నాలు ఫస్ట్‌లుక్ విడుదల
మహానటి నిర్మించిన స్వప్న సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం జాతిరత్నాలు. ఈ సినిమా ద్వారా నాగ్ అశ్విన్ నిర్మాతగా మారుతున్నారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులు. అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నటులు ముగ్గురు ఖైదీ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా నటించిన నవీన్ పొలిశెట్టి ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే మూడొంతలు చిత్రీకరణ పూర్తియింది. రధన్ సంగీతం, సిద్దాన్ మనోహర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నరేష్, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, మిర్చి కిరణ్, గిరిబాబు, మహేష్ తదితరులు నటిస్తున్నారు.













