జాను ప్రీ రిలీజ్ వేడుక
మంచి చిత్రాన్ని ఆస్వాదించి దాని తాలూక జ్ఞాపకాల్ని ఇంటికి తీసుకెళ్లడం అరుదుగా జరుగుతుంది. మంచి జ్ఞాపకంలా ఇంటికి తీసుకెళ్లే చిత్రమిది అని నాని అన్నారు. శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం జాను. సి.ప్రేమ్ కుమార్ దర్శకుడు. దిల్ రాజు, శిరీశ్ నిర్మాతలు. ఈ నెల 7న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. నాని, వంశీ పైడిపల్లి బిగ్ సీడీని ఆవ్కిరించారు. నాని మాట్లాడుతూ 96 రీమేక్ అనగానే టచ్ చేయకపోతే మంచిదని రాజుకి చెప్పా. ట్రైలర్ చూశాక మైండ్లో 96 డిలీట్ అయిపోయింది. ఇప్పుడు రామ్, జాను అంటే శర్వా, సమంతే గుర్తొసున్నారు అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ తమిళ వెర్షన్ చూసినప్పుడు నా గుండె బరువెక్కి రీమేక్ చేయాలనుకున్నా. జాను పాత్రలో సమంతని తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయా. సినిమా చూశాక అందరూ వావ్ అంటూ, అదే హ్యాంగోవర్లో ఉండిపోతారు అన్నారు. మాతృక చూసినప్పుడు క్లాసిక్ సినిమా రీమేక్ జోలికి మనం వెళ్లాలా? అనుకునా. దిల్ రాజు నన్ను నమ్ము అని భరోసా ఇచ్చారు. ఆరు నుంచి 90 ఏళ్ల వరకు అందరికీ కనెక్ట్ అవుతుందీ సినిమా అని శర్వానంద్ చెప్పారు. దిల్ రాజు ఈ సినిమాలో యాక్ట్ చేయమని అడగ్గానే పారిపోయాను. రెండోసారి అడిగి ఒప్పించారు. నా నటనకు క్రెడిట్ దక్కితే దానికి శర్వానంద్ కారణం అవుతాడు అని సమంత అన్నారు.













