తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాను చిత్ర బృందం
జాను చిత్ర బృందం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. జాను చిత్రం హిట్ టాక్ రావడంతో వారంతా అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శర్వానంద్, సమంత, నిర్మాత దిల్ రాజు.. స్వామివారి సేవలో పాల్గొని, మొక్కు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండంలో వారికి వేద పండితుల ఆశీర్వచనం చేయగా ఆయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం విభవ అతిథి గృహం వద్ద దిల్‌రాజు మీడియాతో మాట్లాడుతూ జాను సినిమా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందడంతో స్వామి వారికి మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు. తమిళ హిట్ సినిమాకు త తెలుగులో ఆదరణ రాదని అందరూ అన్నారని, కానీ శర్వనంద్, సమంత అద్భుతంగా నటించారని చెప్పారు. నాని, సుధీర్‌బాబు కాంబినేషన్లో ఓ సినిమా, పింక్ రీమేక్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు దిల్‌రాజు తెలిపారు.













