జాను ఫస్ట్ లుక్ విడుదల
తమిళంలో విజయవంతమైన 96 తెలుగులో రీమేక్ అవుతోంది. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్నారు. సి.ప్రేమ్‌కుమార్ దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాను అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. షరతులు లేని ప్రేమకి నివాళిలాంటి కథ ఇదని చిత్రబృందం తెలిపింది. దిల్ రాజు మాట్లాడుతూ హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేమ్‌కుమార్ అందంగా రూపొందించారు. తొలిసారి కలిసి నటిస్తున్న శర్వానంద్, సమంత పాత్రల్లో ఒదిగిపోయారు. గోవింద్ వసంత సంగీతం, మహేంద్రన్ జయరాజ్ కెమెరా పనితనం అదనపు బలాలు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ని, పాటల్ని విడుదల చేస్తామన్నారు. మాటలు: మిర్చి కిరణ్, పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి.













