Trivikram: త్రివిక్రమ్ బన్నీకే ఓటేస్తున్నాడా?
ఇండస్ట్రీలో ఏ ప్రాజెక్టు ఎప్పుడు ఎవరి చేతుల్లోకి వస్తుందో తెలియదు. ఒకరు చేయాల్సిన సినిమా మరొకరి చేతుల్లోకి వెళ్లడం, ఒకరితో అనౌన్స్ అయిన సినిమా ఆ తర్వాత చేతులు మారి మరో హీరో చేయాల్సి రావడం ఇలా ఎన్నో సందర్భాల్లో జరిగాయి. ఇప్పుడు టాలీవుడ్ లో మళ్లీ అలాంటి సిట్యుయేషన్ ఒకటి మళ్లీ కనిపిస్తుంది. త్రివిక్రమ్(Trivikram) త్వరలో ఓ మైథాలజీ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ మైథలజీ మూవీలో ఎన్టీఆర్(NTR) హీరోగా నటిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తున్న, అందులో జరిగిన మార్పులు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి త్రివిక్రమ్ ముందు ఈ సినిమాను అల్లు అర్జున్(Allu Arjun) తో చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఎన్టీఆర్ వద్దకు వెళ్లింది. దానికి తోడు ఎన్టీఆర్ కూడా ఈ కాన్సెప్ట్ కు సంబంధించిన బుక్ ను పట్టుకుని కనిపించడంతో అందరూ అదే నిజమనుకున్నారు.
కానీ ఇప్పుడు మళ్లీ మొదట అనుకున్నదే జరగనుందని, త్రివిక్రమ్ ఈ సినిమాను అల్లు అర్జున్ తోనే చేయాలనుకుంటున్నారని, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్(Harika Haassine Creations) లో ఈ సినిమా రూపొందే ఛాన్సుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఏ మేరకు నిజముందనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.






