To The Moon: కొరియన్ సినిమాపై ఇండియన్స్ ఫైర్
కొరియన్ సినిమాలకు, వెబ్ సిరీస్ లకు ఇండియాలో చాలా క్రేజ్ ఉంది. యూత్ లో చాలా మంది ఓటీటీల్లో కొరియన్ కంటెంట్ చూస్తూంటారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఫ్యాన్స్ కొరియన్ కల్చర్ ను, వారి క్రియేటివిటీని ఆరాధిస్తుంటారు. కానీ ఇటీవల ఓ కొరియన్ డ్రామాలోని కొన్ని సన్నివేశాలు భారతీయ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీశాయి.
తాము చాలా ఆరాధించే కొరియన్ సినిమాల్లో ఇండియన్ సంస్కృతిని అరబ్ సంస్కృతితో కలిపి తప్పుగా చూపించడంతో పాటూ కొన్ని పవిత్రమైన గుర్తులను జోకులుగా మార్చడం ఇండియన్ ఆడియన్స్ కు బాధను కలిగిస్తూ వారిని చాలా నిరాశకు గురి చేశాయి. పొరుగున ఉన్న ఆసియా కల్చర్య పై కనీస గౌరవం, అవగాహన లేకపోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.
కామెడీ కోసం టు ది మూన్(to the moon) షో లో బొట్టు లాంటి సాంస్కృతిక అంశాలను వాడటం వివాదాస్పదంగా మారింది. మొదట్లో ఇది ప్రోగ్రెస్సివ్ గా కనిపించినప్పటికీ తర్వాత ఇండియాను ఇలా చూపించడం కరెక్ట్ కాదని, ఇండియా గురించి సరిగ్గా చూపించడం రాకపోతే దాన్ని వదిలేయాలని, అంతేకానీ ఇలా చూపించి దేశం విలువను తగ్గించకుండా ఉండాలని చిత్ర యూనిట్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.







