Ilayaraja: ఇళయరాజాపై డైరెక్టర్ కాంట్రవర్సీ కామెంట్స్
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా(Ilayaraja)కు భాషతో సంబంధం లేకుండా ఎంతోమంది అభిమానులున్నారు. ఆయన సంగీతం గురించి, ఆయన సంగీతంతో చేసే మ్యాజిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఎవరికైనా కోపం రావడం సహజం. రీసెంట్ గా ఇళయరాజాపై ఓ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఆయన ఫ్యాన్స్ ను కోపానికి గురి చేస్తున్నాయి.
డిటెక్టివ్(Detective), సైకో(Psycho), పిశాచి(Pisachi) లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన మిస్కిన్ రీసెంట్ గా బాటిల్ రాధ(Bottle Radha) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇళయరాజాపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మిస్కిన్(Mysskin) స్పీచ్ లో భాగంగా ఇళయరాజా సంగీతం గురించి కామెంట్ చేశాడు. ఇళయరాజా సంగీతం వల్ల ఎంతో మంది మద్యానికి బానిసలై ఆరోగ్యాలు పాడు చేసుకున్నారన్నాడు.
మిస్కిన్ ఏ ఉద్దేశంతో చెప్పినా ఆయన చెప్పింది తప్పే కావడంతో సోషల్ మీడియాలో మిస్కిన్ ను ఓ రేంజ్ లో ఏకి పారేస్తున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న మిస్కిన్ తనను క్షమించమని కోరాడు. తాను ఎంత క్షమాపణ చెప్పినా జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. ఇదిలా ఉంటే మిస్కిన్ గతంలో ఓ సారి తన సినిమా కొట్టుకలి(Kottukali) సరిగా ఆడకపోతే నగ్నంగా నిలబడతానని స్టేట్మెంట్ ఇచ్చి కాంట్రవర్సీ పాలయ్యాడు. ఇప్పుడు ఇళయరాజా గురించి మాట్లాడి మరోసారి కాంట్రవర్సీ చేశాడు.













