Allari Naresh: ఫ్లాపుల నుంచే నేర్చుకున్నా!
సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న అల్లరి నరేష్(allari naresh) ఆ సినిమాతో కామెడీ అంటే ఇలా ఉంటుందా అని ప్రూవ్ చేసింది. అల్లరి మూవీ నుంచి నరేష్ ఎక్కువగా కామెడీకి ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేసుకుంటూ వచ్చారు. అల్లరి నరేష్ మూవీ అంటే ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఏమీ ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లే వారు. అల్లరి నరేష్ మూవీకి వెళ్తే కాసేపు హ్యాపీగా నవ్వుకోవచ్చనే ఆలోచనతో ఉండేవాళ్లు.
తన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తో టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్, తన కెరీర్లో ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేశారు. మొదట్లో ఎక్కువగా కామెడీ సినిమాలు చేసిన నరేష్ మధ్యలో కథా ప్రాధాన్యమున్న మూవీస్ కూడా చేశాడు. ఆ తర్వాత నాంది లాంటి సీరియస్ సినిమాలు తీసి మంచి సక్సెస్ ను అందుకున్నాడు నరేష్.
కాగా నరేష్ ఇప్పుడు 12ఎ రైల్వే కాలనీ(12A Railway Colony) అనే థ్రిల్లర్ మూవీ చేయగా, ఆ సినిమా నవంబర్ 21న రిలీజ్ కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను చేసిన సినిమాల్లో హిట్ల కంటే ఫ్లాపులనే ఎక్కువగా సొంతం చేసుకున్నానని, ఫ్లాపులే వల్లే తాను మరింత బెటర్ యాక్టర్ గా మారానని చెప్పగా, నరేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






