రాజా సాబ్లో ఊహించని ట్విస్టులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్. పెద్దగా అంచనాలు లేకుండా మొదలైన ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజయ్యాక క్రమంగా అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. లుంగీలో ప్రభాస్ లుక్ రచ్చ లేపింది. అంతేకాదు, రాజా సాబ్ లో ప్రేక్షకులు ఊహించని ఎన్నో అంశాలుంటాయని, విఎఫ్ఎక్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని నిర్మాత చెప్తున్నాడు.
దీంతో ఒక్కసారిగా రాజా సాబ్ పై అంచనాలు భారీగా పెరిగాయి. నిర్మాతనే కాదు ఇన్ సైడ్ టాక్ ప్రకారం కూడా రాజా సాబ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో మారుతి, ప్రభాస్ క్యారెక్టర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశాడట. చిలిపితనం, సీరియస్నెస్ రెండూ మిక్స్ చేసేలా ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందట.
అంతేకాదు సినిమా సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు, క్లైమాక్స్ కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయంటున్నారు. కాబట్టి రాజా సాబ్ పైకి కనిపిస్తున్నంత సాఫ్ట్ కాదని అర్థమైపోతుంది. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందంటున్నారు కానీ అది సాధ్యపడేలా లేదు. సంక్రాంతికి ప్రభాస్ హోమ్ బ్యానర్ నుంచి విశ్వంభర రిలీజవుతుంది కాబట్టి రాజా సాబ్ ను రిలీజ్ చేయడానికి ప్రభాస్ ఇంట్రెస్ట్ చూపడు. ఆ తర్వాత మంచి రిలీజ్ డేట్ చూసుకుని ఎటాక్ చేయడానికి రాజా సాబ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.













