Akhanda2: అదే నిజమైతే బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ!

వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) ప్రస్తుతం తన ఆస్థాన డైరెక్టర్ బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో అఖండ2(akhanda2) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 2021లో రిలీజైన బ్లాక్ బస్టర్ అఖండ(akhanda) సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ కావడంతో దీనిపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బోయపాటి అఖండ2ను రూపొందిస్తున్నాడు.
అయితే ఇప్పుడు అఖండ2 గురించి ఓ విషయం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అఖండతో పోలిస్తే బోయపాటి అఖండ2 లో యాక్షన్ సీన్స్ ను భారీగా ప్లాన్ చేశాడని అంటున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ 25 నిమిషాలకు పైగా ఉంటుందని, ఆ యాక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందని తెలుస్తోంది.
కాగా మూవీలోని ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను రీసెంట్ గా చూసిన నెట్‌ఫ్లిక్స్(netflix) దాన్ని 20 నిమిషాల్లోపు ఉండేలా ట్రిమ్ చేయమని మేకర్స్ ను రిక్వెస్ట్ చేశారని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా కోసం నార్త్ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ చేసిన బోయపాటి సినిమాలో నిజంగానే 25 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ను పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రగ్యా జైస్వాల్(pragya jaiswal), సంయుక్త మీనన్(samyuktha menon) కీలకపాత్రల్లో నటిస్తున్న అఖండ2లో ఆది పినిశెట్టి(adhi pinisetty) విలన్ గా నటిస్తుండగా, డిసెంబర్ 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.