యానిమల్ హీరో రీరిలీజ్‌కు హౌస్ ఫుల్స్
ఏదైనా ఒక రీరిలీజ్ సినిమాకు సాధారణంగా ఒకటి రెండ్రోజులు హంగామా ఉండటం నార్మల్. కానీ ఆ తర్వాత మాత్రం అంతా మామూలైపోతుంది. ఎంత బ్లాక్ బస్టర్ సినిమా అయినా ఈ రోజుల్లో ఓటీటీలో ఈజీగా దొరుకుతుంది. అలాంటప్పుడు మళ్లీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లి వాటిని చూడాలని అనుకోరు. కానీ బాలీవుడ్ మూవీ రాక్ స్టార్ మాత్రం దీనికి భిన్నంగా దూసుకెళ్తోంది.
రీసెంట్ గా గత వారం రీ రిలీజ్ అయిన రణ్‌బీర్ కపూర్ రాక్ స్టార్ సినిమాకు విపరీతమైన జనాదరణ దక్కుతుంది. ఈ మ్యూజికల్ డ్రామాకు అసలు క్రేజ్ తగ్గడం లేదు. గత 24 గంటల్లో ఈ సినిమాకు 40 వేలకు పైగా టికెట్స్ బుక్కయ్యాయంటే రాక్ స్టార్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రాక్ స్టార్ రూ.40 లక్షల గ్రాస్ దాటింది. ఇదంతా యానిమల్ సినిమా ఎఫెక్టే.
ఎందుకంటే రాక్ స్టార్ సినిమా 2011లో వచ్చింది. ఇప్పుడు టీనేజ్ లో ఉన్న రణ్‌బీర్ ఫ్యాన్స్ అంతా ఆ సినిమాను థియేటర్లలో చూసి ఉండరు. కానీ ఇప్పుడదే ఫ్యాన్స్ టీనేజ్ కు వచ్చారు. ఆ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు రాక్ స్టార్ ను థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమాకు హౌస్ ఫుల్స్ తో థియేటర్లు కళకళలాడుతున్నాయి. హైదరాబాద్ లో రోజుకు కనీసం ఆరేడు షోలు వేస్తున్నారంటే సిట్యుయేషన్ అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు రూ.112 టికెట్ రేట్ కూడా దీనికి ప్లస్ అవుతుంది. మొత్తానికి ఈ సినిమా ఫైనల్ రన్ అయ్యేలోపు ఎంతలేదన్నా అయిదారు కోట్ల గ్రాస్ ను అకౌంట్ లో వేసుకోవడం గ్యారెంటీ అనిపిస్తోంది.













