‘డాక్టర్’ తమన్నాగా మిల్కీబ్యూటీ
మిల్కీబ్యూటీ తమన్నా సౌత్‌లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. బాహుబలి చిత్రంలో మెరుపు తీగలా మెరిసి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఓ తమిళ్ సినిమాతో బిజీగా ఉన్న తమన్నాకు ఓ అరుదైన గౌరవం దక్కనుంది. సౌత్ సినిమాకు తమన్నా చేసిన సేవలకుగాను సిఐఎసి అనే ఓ ఎన్జీవో సంస్థ అమెకు గౌరవ డాక్టరేట్ ఇవ్వబోతోంది. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన తమన్నా సౌత్ సినిమాలు, బాలీవుడ్ మూవీలతో కలిపి సుమారుగా 50 సినిమాలకు పైగా నటించింది. తమిళనాడు కలైమని అవార్డు, సౌత్‌స్కోప్ అవార్డు, సైమా అవార్డులు అందుకున్న ఈ భామ ఇప్పుడు గౌరవ డాక్టరేట్‌ను అందుకోనుంది. ఇక ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విక్రమ్ సినిమా స్కెచ్‌లో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్లో కూడా ఓ సినిమా చేస్తున్న మిల్కీబ్యూటీ తెలుగులో సందీప్ కిషన్గా హీరోగా ఓ మూవీ చేస్తోంది.













