Heroines: కలిసిరాని రీఎంట్రీ
ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుని రీసెంట్ గా ఎన్నో ఆశలతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. వాళ్లే అన్షు(Anshu), లయ(Laya), జెనీలియా(Genelia). మన్మథుడు(Manmadhudu), రాఘవేంద్ర(Raghavendra) సినిమాలతో అందరినీ అలరించిన అన్షు మొన్నా మధ్య మజాకా(Mazaaka) సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా ఫ్లాపుగా నిలిచింది.
నితిన్(Nithin) హీరోగా వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు(Thammudu) సినిమాతో అలనాటి హీరోయిన్ లయ రీఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి తమ్ముడు కంటే బెటర్ స్టోరీ ఉండదనిపించిందని, అందుకే ఆ సినిమాతో తిరిగి సినిమాల్లోకి వస్తున్నానని చెప్పిన లయకు తమ్ముడు తీవ్ర నిరాశనే మిగిల్చింది. తమ్ముడు సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జెనీలియా రీసెంట్ గా కిరీటీ(Kireeti) హీరోగా నటించిన జూనియర్(Junior) అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రీఎంట్రీ ఇచ్చారు. జూనియర్ తన సరైన కమర్షియల్ కంబ్యాక అవుతుందని జెన్నీ ఎంతో ఆశపడింది. కానీ జూనియర్ సినిమాతో జెనీలియా మంచి కంబ్యాక్ అందుకోలేకపోయింది. దీంతో ముగ్గురు హీరోయిన్లకు కంబ్యాక్ నిరాశనే మిగిల్చిందని చెప్పాలి.







