కర్ణుడిగా సూర్య..
రీసెంట్ గా వచ్చిన కల్కి(Kalki)లో ప్రభాస్(Prabhas) కాసేపు కర్ణుడిగా కనిపిస్తేనే ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మహాభారతం(Maha Bharatham)లో ఎన్ని పాత్రలున్నా, కర్ణుడికి సపరేట్ ఫ్యాన్ బేసి ఉంటుంది. కర్ణుడి(Karnudu) పుట్టుక నుంచి ప్రతీదీ భిన్నంగా ఉండటం వల్ల ఆయన కథ అందరినీ బాగా ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నో సినిమాల్లో కర్ణుడి క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది.
అయితే ఇంత ఇంట్రెస్టింగ్ రోల్ మీద సోలో సినిమా తీయాలని ఎందరో ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నించారు కానీ అవేవీ ముందుకు వెళ్లడం లేదు. విక్రమ్(Vikram) హీరోగా ఓ మలయాళ డైరెక్టర్ భారీ బడ్జెట్ లో కర్ణుడి(Lord Karna)పై సినిమా తీయడానికి సన్నాహాలు జరిగాయి కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. తర్వాత సూర్య(Suriya) హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా(Rakesh Om prakash Mehra) దర్శకత్వంలో కర్ణుడి కథతో సినిమా రానుందని వార్తలొచ్చాయి. తర్వాత దీని గురించి కూడా వార్తలేమీ రాలేదు.
తాజాగా రాకేష్ మెహ్రా, సూర్యతో కర్ణుడి మూవీ గురించి రెస్పాండ్ అయ్యారు. తమ కాంబోలో కర్ణుడిపై సినిమా రానుందని వస్తున్న వార్తలు నిజమేనని మీడియాకు తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందనుందని ఆయన తెలిపాడు. అన్నీ కుదిరి సినిమా బాగా వస్తే ఈ మూవీ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనో ఎపిక్ మూవీగా నిలవడం ఖాయం.













