యాదాద్రిలో హీరో రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం
కరోనా నుంచి కోలుకున్న మళ్లీ సినిమాల బాట పట్టారు. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ యాదగిరిగుట్టలో ప్రారంభమైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న హీరో రాజశేఖర్ తిరిగి మొహానికి మేకప్ వేసుకునేందుకు సిద్ధమయ్యారు. పూలరంగడు, ఆహా నా పెళ్లంట.. చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా యాదగిరిగుట్టలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్‌తో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట.ఈ షెడ్యూల్ ముగిశాక ఫిబ్రవరి నుంచి వికారాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారట. కెరీర్ ముగిసిపోయిందనుకున్న సమయంలో గరుడవేగ, కల్కి.. వంటి విభిన్న సినిమాలతో హిట్లు అందుకున్న రాజశేఖర్ తాజా సినిమాతో మరో హిట్ అందుకోవాలని ఆశిద్దాం.













