నాని కష్టాన్ని వాళ్లు గుర్తిస్తారా?
నేచురల్ స్టార్ నాని దసరా మూవీతో చాలా పెద్ద సాహసమే చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో కలిపి 5 భాషల్లో రిలీజ్ కాబోతుంది. నాని సినిమాలు వేరే భాషల్లో రిలీజవడం కొత్తేమీ కాదు కానీ ఈసారి దసరా సినిమాతో పూర్తి స్థాయి పాన్ ఇండియన్ ఫిల్మ్ లో నటించాడు నాని. దసరా సినిమా మొదలైన దగ్గర నుంచి ఈ సినిమాను పాన్ ఇండియన్ లెవల్లోనే ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్ ముందు ప్రమోషన్లు ఏంటీ నాని ఇంతలా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏవో నాలుగు పెద్ద సిటీలు చూసి సెలెక్ట్ చేసుకున అక్కడో ప్రెస్ మీట్ పెడతారనుకున్నారు. కానీ ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా నానినే కనిపించేట్లు దసరాను ప్రమోట్ చేస్తున్నాడు.
ఉత్తరాదిన లక్నో సహా వేర్వేరు టౌన్స్‌లో తిరిగాడు. సౌత్‌కు వచ్చి మళ్లీ ఇక్కడ చాలాచోట్ల ప్రమోషన్లు చేస్తున్నాడు. పాన్ ఇండియన్ మూవీకి ప్రమోషన్ అంటే నానిలా చేయాలని చెప్పుకునేలా నాని దసరాను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే నాని పడుతున్న కష్టానికి ఏ మేరకు రిజల్ట్ వస్తుందనేదే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది.
నాని కష్టాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు కాకుండా ఎంతమంది గుర్తించి ఉంటారు? దసరాకు మిగిలిన భాషల్లో ఓపెనింగ్స్ వస్తాయా? నానికి దసరాతో పాన్ ఇండియన్ లెవల్లో గుర్తింపు వస్తుందా అనేది మాత్రం సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.













