సింగిల్ క్యారెక్టర్ తో …’105 మినిట్స్’ కంప్లీట్
ఒకే ఒక్క పాత్రలో ఎడిటింగ్ లేకుండా రీల్ టైమ్, రియల్ టైమ్ టెక్నిక్‌తో రూపొందుతున్న చిత్రం 105 మినిట్స్. హన్షిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రాజు దుస్పా దర్శకుడు. బొమ్మక్ శివ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. హన్సిక పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు బాబీ విడుదల చేశారు. ఇందులో చేతికి, కాళ్లకు సంకెళ్లతో బందీగా హన్సిక కనిపిస్తోంది. నిర్మాత మాట్లాడుతూ ప్రయోగాత్మక కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. సింగిల్‌షాట్‌లో ఎడిటింగ్ లేకుండా రూపొందిస్తున్నాం. హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని ఓ ఇంట్లో షూటింగ్ చేశాం. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలను ప్రారంభిస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, ఛాయాగ్రహణం: కిశోర్ బోయిడపు.













