జెర్సీ దర్శకుడితో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ చిత్రం?
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రాంచరణ్, తాజాగా మరో సినిమాకు ఓకే చేసినట్లు తెలుస్తోంది. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథకు ఆయనకు నచ్చడంతో డిస్కషన్స్ జరుగుతున్నాయట. దీంతో పాటు కొరటాల శివ డైరెక్షన్ లో ‘ఆచార్య’లోనూ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇవి తప్ప చరణ్ సినిమాలకు సంబంధించి ఇంకెలాంటి అప్డేట్స్ లేవు. దీంతో ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. లాక్డౌన్ సమయంలో చాలామంది దర్శకులు చరణ్‌కి కథలు వినిపించినా ఏ ఒక్కటీ ఫైనల్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం రామ్‌చరణ్ ఓ దర్శకుడికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ‘జెర్సీ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గౌతమ్ తిన్ననూరితో రామ్‌చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్ టాక్. గౌతమ్ చెప్పిన కథ చెర్రీకి బాగా నచ్చిందట. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోందట. ప్రస్తుతం స్టోరీకి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.













