నవంబర్‌లో వచ్చేస్తున్నా సిద్ధంగా ఉండండి!
తమిళ సూపర్‌స్టార్ కమల్‌హాసన్ తన అభిమానులకు పొలిటికల్ ఎంట్రీపై హింట్ ఇచ్చాడు. తన పుట్టిన రోజయిన నవంబర్ 7న ఓ ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. సిద్ధంగా ఉండండి అంటూ తన అభిమానులకు పిలుపునిచ్చాడు. ఈ ప్రకటనలోనే అభిమానులు తనతో ఎలా మాట్లాడవచ్చు అన్న వివరాలు కూడా వెల్లడిస్తానని వికటన్ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ చెప్పాడు. ఇప్పటీకే రాజకీయాల్లో రావడంపై వివిధ పార్టీల నేతలతో కమల్ సమావేశమైన విషయం తెలిసిందే. కేరళ, ఢిల్లీ సీఎంలు విజయన్, కేజ్రీవాల్‌లను కమల్ కలిశాడు. తన ఆలోచనలు, సిద్ధాంతాలు ప్రస్తుతం ఉన్న ఏ పార్టీతోనూ కలిసేలా లేవని, అందుకే తానే సొంతంగా పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు కమల్ తెలిపాడు.













