Delhi Police: సినిమా కోసం తప్పుడు వార్తలు ప్రచారం
ఎవరైనా సరే, ఏ రంగంలోనైనా సరే నలుగురికి తమ గురించి, తమ బ్రాండ్ గురించి తెలియాలంటే పబ్లిసిటీ, ప్రమోషన్స్ అనేవి తప్పనిసరి. సినీ రంగంలో ఈ ప్రమోషన్స్ కు చాలా పెద్ద పీట వేస్తారు దర్శకనిర్మాతలు. అందులో భాగంగానే ప్రమోషన్స్ కోసం చాలా ఖర్చు కూడా పెడుతుంటారు. సినిమా పూర్తైన తర్వాత రకరకాల ప్రమోషన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.
అయితే బాలీవుడ్ లోని ఓ నిర్మాణ సంస్థ చేస్తున్న ప్రచారం ఇప్పుడు జనాలకు భయాందోళనలను కలిగిస్తోంది. అసలు విషయానికొస్తే ఢిల్లీలో గత 15 రోజుల గ్యాప్ లో 800మందికి పైగా ఆడవాళ్లు మిస్ అయ్యారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. కానీ వాస్తవానికి అసలు ఎలాంటి మిస్సింగ్స్ జరగలేదని, ఇదంతా ఫేక్ పబ్లిసిటీ స్టంట్స్ అని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఢిల్లీలో ఆడవాళ్లు తప్పిపోతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్స్ కు కారణమని, రీసెంట్ గా రిలీజైన తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి బాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ పెయిడ్ ప్రమోషన్స్ ను చేయిస్తోందని, స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రచారాలను చేస్తూ చూస్తూ ఊరుకోమని, వారిపై తగిన విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్స్ వేదికగా ఢిల్లీ పోలీసులు పోస్ట్ చేయగా, అలా చేసిన నిర్మాణ సంస్థ ఏంటా అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.
https://x.com/DelhiPolice/status/2019631225884012897?













