అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఫాహద్
ఫాహద్ ఫాజిల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటించి తెలుగు ఆడియన్స్ కు ఎంతో దగ్గరయ్యాడు ఫాహద్. ఆ సినిమాలో ఫాహద్ కనిపించేది తక్కువ సేపే అయినా ఆ పాత్రలో తను నటించిన తీరు, తన పాత్రతో అతను వేసిన ఇంపాక్ట్ చాలా బలమైంది. పుష్ప కంటే ముందు ఫాహద్ ఎన్నో సినిమాలు చేశాడు. కానీ పుష్పతోనే తన క్రేజ్, మార్కెట్ రెండూ పెరిగాయి. ప్రస్తుతం పుష్ప2 సినిమాలో నటిస్తున్న ఫాహద్ తన ఆరోగ్యానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. తాను ఏడీహెచ్డీ అనే అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు ఫాహద్ తెలిపాడు. అంటే అటెన్షన్ డెఫిషిట్ హైపరాక్టివిటీ డిజార్డర్. ఈ సమస్య వల్ల మెదడు పనితీరు ప్రభావం అవుతుంది.
మామూలుగా అయితే ఈ సమస్య చిన్న పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుందట. దీని వల్ల ఏ విషయం మీద ఎక్కువ సేపు శ్రద్ధ పెట్టలేరట. కొన్ని సార్లు ఎక్కువగా ప్రవర్తించడం, త్వరగా ఆవేశపడటం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయట. ఈ లక్షణాలను గుర్తించి డాక్టర్ ను సంప్రదిస్తే తనకున్న సమస్య బయటపడిందని ఫాహద్ రీసెంట్ గా ఓ టీవీ ప్రోగ్రామ్ లో వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమవుతుందోననే విషయం గురించి డాక్టర్లతో మాట్లాడుతున్నట్లు ఫాహద్ చెప్పాడు.













