యధార్ధ కథతో డీఎస్జే .. దెయ్యంతో సహజీవనం
నట్టి కరుణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డీఎస్జే (దెయ్యంతో సహజీవనం). నట్టి కుమార్ దర్శకుడు. రాజీవ్ సాలూరు కీలక పాత్రను పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల టీజర్లను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ యథార్థ కథ ఆధారంగా రూపొందించాం. తనకు జరిగిన అన్యాయానికి ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందన్నదే చిత్ర ఇతివృత్తం. గ్రాఫిక్స్ మెప్పిస్తాయి. త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు. తన తండ్రి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించడం ఆనందంగా ఉందని కథనాయిక నట్టి కరుణ చెప్పింది. ఈ చిత్రానికి కెమెరా: వెంకట హనుమ, నిర్మాత: నట్టి క్రాంతి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం :నట్టికుమార్.













