Dragon: డ్రాగన్ మూవీ లేటెస్ట్ అప్డేట్
దేవర(devara) సినిమా తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) తెలుగులో చేస్తున్న సినిమా డ్రాగన్(Dragon). మధ్యలో హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి వార్2(war2) సినిమా చేసినా అది బాలీవుడ్ లెక్కలోకి వెళ్తుంది. పైగా భారీ అంచనాలతో వచ్చిన వార్2 బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక ఫ్లాపుగా నిలిచింది. ఇక డ్రాగన్ విషయానికొస్తే ఈ సినిమాకు ప్రశాంత్ నీల్(prasanth neel) దర్శకత్వం వహిస్తున్నాడు.
కెజిఎఫ్(KGF), సలార్(Salaar) సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటూ అందులో మాస్ హీరో ఎన్టీఆర్ నటిస్తుండటం, వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి మూవీ కావడంతో డ్రాగన్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడట. కాగా ఈ మూవీ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.
కొంత గ్యాప్ తర్వాత రీసెంట్ గానే డ్రాగన్ మూవీ కొత్త షెడ్యూల్ మొదలైందని, ఈ షెడ్యూల్ ఈ నెలలోనే పూర్తి కానుందని, నెక్ట్స్ షెడ్యూల్ డిసెంబర్ లో శ్రీలంకలో మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. రుక్మిణి వసంత్(rukmini vasanth) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్(Ravi basrur) సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) డ్రాగన్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.






