Devi Sri Prasad: దేవీ శ్రీ కి ఆ టాలెంట్ ఉందా?

తెలుగు, తమిళ భాషల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎనలేని కీర్తి ప్రతిష్టలు అందుకున్నాడు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad). ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్ చిన్న వయసులోనే ఎక్కువ సినిమాలకు వర్క్ చేయడమే కాకుండా ఎంతో స్టార్‌డమ్ ను కూడా చూశాడు. అయితే దేవీ మల్టీ టాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా సింగర్ గా, లిరిక్ రైటర్ గా, కొరియోగ్రాఫర్ గా ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా దేవీ శ్రీ లోని మరో టాలెంట్ బయటపడింది. పాటలకు ట్యూన్లు కంపోజ్ చేసే దేవీ శ్రీ ప్రసాద్ గోల్డ్ ఆర్నమెంట్స్ ను కూడా డిజైన్ చేయగలడనే విషయం తాజాగా అతను చెప్పే వరకు ఎవరికీ తెలియలేదు. ఈ విషయాన్ని స్వయంగా దేవీ శ్రీ ప్రసాదే వెల్లడిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా దేవీ శ్రీ తన తల్లిదండ్రులను ఫోటో తీస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఫోటో తనకెంతో మెమొరబుల్ అని, తాను ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన తండ్రికి గోల్డ్ మ్యూజికల్ స్టైల్ బ్రేస్‌లెట్, తల్లికి డైమండ్స్ తో ఉన్న గోల్డ్ మ్యూజికల్ నోట్స్ తో ఉన్న బ్యాంగిల్ ను గిఫ్ట్ చేసి ఆ సందర్భంగా తీసిన ఫోటోను షేర్ చేశాడు దేవీ. ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ ను తానే స్వయంగా డిజైన్ చేశానని, తన వద్ద గోల్డ్ షాపులో వాటిని డిజైన్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో కూడా ఉండాలని, త్వరలోనే వెతికి ఆ వీడియోను కూడా షేర్ చేస్తానని చెప్తూ అందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలను తెలిపాడు. దేవీశ్రీ పోస్ట్ చూసిన అభిమానులు అతనికి ఈ టాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.