ఆ మల్టీస్టారర్ చేయాలని త్రివిక్రమ్ ను ఒత్తిడి చేస్తున్న నిర్మాత
సైంధవ్ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ ను త్రివిక్రమ్ దర్శకత్వంలో నానితో మల్టీస్టారర్ చేస్తున్న మాట నిజమేనా అని అడిగితే త్రివిక్రమ్ కు కాల్ చేసి అడగండని ఫన్నీగా ఆన్సరిచ్చాడు వెంకీ. అయితే ఓ నిర్మాత మాత్రం ఈ కాంబినేషన్ కోసం తెగ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ-నాని హీరోలుగా కాంబినేషన్ ను సెట్ చేయాలని ఆ నిర్మాత చూస్తున్నాడట.
ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్న నాని, ఆ తర్వాతి సినిమాను శ్రీకాంత్ ఓదెలతో చేయనున్నాడు. కానీ ఆ సినిమాకు 6 నెలలు టైమ్ ఉండటంతో ఈ లోగా మరో మూవీ చేయాలని నాని చూస్తున్నాడట. సైంధవ్ రిజల్ట్ తో నిరాశ పడిన వెంకీ కూడా ఇప్పటి వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేయలేదు.
దీంతో ఆ నిర్మాత ఈ మల్టీస్టారర్ ప్లాన్ ను ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాడట. ఈ సినిమా హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో కాకుండా బయట ప్రొడక్షన్ లో ఉంటుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ గతంఓల చేసుకున్న కమిట్మెంట్స్ ప్రకారం బన్నీతో సినిమా చేయాల్సింది కానీ బన్నీ ఫ్రీ అవడానికి టైమ్ పడుతుంది కాబట్టి ఈ లోపు ఈ మల్టీస్టారర్ ను చేయాలని ఆ నిర్మాత ఫోర్స్ చేస్తున్నాడట. మరి త్రివిక్రమ్ దానికి ఓకే అంటాడో లేదో చూడాలి.













