Maruthi: ప్రభాస్ కు అలాంటి సినిమాలంటే చాలా ఇష్టం
బాహుబలి(Bahubali) తర్వాత ప్రభాస్(Prabhas) స్థాయి ఏ రేంజ్ లో పెరిగిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత అతని మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగింది. అయితే తన క్రేజ్ పెరిగినప్పటికీ ప్రభాస్ మాత్రం ఎప్పుడూ రిస్క్ చేయడానికి వెనుకాడలేదు. బాహుబలి తర్వాత చేసిన జానర్ లో సినిమాలు చేయకుండా కొత్తగా ప్రయత్నిస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ తన మార్కెట్ ను మరింత పెంచుకుంటూ వస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ రీసెంట్ గా ప్రభాస్ గురించి, రాజా సాబ్(Raja Saab) సినిమా గురించి డైరెక్టర్ మారుతి(Maruthi) ఓ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ సినిమాలను గమనిస్తే ఆయన చేసినన్ని ప్రయోగాలను ఎవరూ చేయరని, ఆయనకు ప్రేమ కథా చిత్రమ్(Prema kathachitram) అనే సినిమా అంటే ఇష్టమని, ఆ విషయాన్ని రెండు మూడు సార్లు తనకు చెప్పారని మారుతి అన్నాడు.
ఆ సినిమాలోని ఫన్, హార్రర్ ఎలిమెంట్స్ అంటే ప్రభాస్ కు ఎంతో ఇష్టమని చెప్పిన మారుతి, రాజా సాబ్ లో విలన్ కు, హీరోకు మధ్య వచ్చే సీన్స్ చాలా కొత్తగా ఉంటాయని ఈ మూవీ కోసం తాను, ప్రభాస్ చాలా కష్టపడ్డామని, స్క్రీన్ పై తమ హార్డ్ వర్క్ కనిపించడంతో పాటూ బిగ్ స్క్రీన్ పై ఈ సినిమాను చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారని మారుతి చెప్పాడు. కాగా ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
https://x.com/chitrambhalarei/status/1999877261714227326?s=12&t=WY6ojOJj3zQGHgXs84FgLA






