Lokesh Kanagaraj: మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న డైరెక్టర్
లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) మా నగరం(Maa Nagaram) సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన ఖైదీ(Khaidhi), విక్రమ్(Vikram), లియో(Leo) సినిమాలే అతన్ని స్టార్ డైరెక్టర్ ని చేశాయి. కేవలం కోలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా లోకేష్ కు మంచి క్రేజ్ ఉంది. డైరెక్టర్ గా ఓ వైపు సినిమాలను చేస్తూనే ఓ కొత్త బ్యానర్ ను స్థాపించి నిర్మాతగా అందులో సినిమాలు కూడా నిర్మిస్తూ బిజీ అయ్యాడు లోకేష్.
అంత బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా మారబోతున్నాడని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్(Captain Miller) డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్(Arun Matheswaran) దర్శకత్వంలో లోకేష్ హీరోగా నటించనున్నాడని, లోకేష్ యాక్టింగ్ డెబ్యూ ఈ సినిమాతోనే జరగనుందని అంటున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్యా స్టోరీ డిస్కషన్స్ కూడా పూర్తయ్యాయని కోలీవుడ్ వర్గాలంటున్నాయి.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం లోకేష్ మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన ట్రైనింగ్ ను థాయ్లాండ్ లో తీసుకుంటున్నాడని, ఓ వైపు ట్రైనింగ్ తీసుకుంటూనే మరోవైపు తాను దర్శకత్వం వహిస్తున్న కూలీ(Coolie) సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా లోకేష్ పూర్తి చేస్తున్నాడని అంటున్నారు. అయితే లోకేష్ కు యాక్టింగ్ కొత్తేమీ కాదు, ఆల్రెడీ గతంలో శృతి హాసన్(Shruthi Hassan) తో కలిసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో నటించగా, అందులో లోకేష్ కు నటుడిగా మంచి పేరు వచ్చింది.






