రణవీర్ సింగ్ ‘ధురందర్’ చిత్రానికి కొత్త చిక్కులు..!
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ధురందర్‘ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే ‘స్క్రిప్ట్ చోరీ’ (Script Theft) ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ చిత్ర నిర్మాతలు, ఇప్పుడు మరో చిక్కుల్లో పడ్డారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘త్రిమూర్తి ఫిల్మ్స్’ (Trimurti Films) ధురందర్ చిత్ర బృందంపై కాపీరైట్ ఉల్లంఘన కింద దావా వేయడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.
‘త్రిచి టోపీవాలే’ అనే పాట చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. 1989లో త్రిమూర్తి ఫిల్మ్స్ బ్యానర్‌పై వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘త్రిదేవ్’ లోని ఈ సూపర్ హిట్ పాటను, ‘ధురందర్’ చిత్రంలో అనధికారికంగా ఉపయోగించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తమ అనుమతి లేకుండా, కనీసం క్రెడిట్స్ ఇవ్వకుండా ఈ పాటను వాడుకోవడం కాపీరైట్ చట్టాల ఉల్లంఘన అని త్రిమూర్తి ఫిల్మ్స్ వాదిస్తోంది. ఈ మేరకు ఆదిత్య ధర్ మరియు చిత్ర నిర్మాణ సంస్థపై న్యాయస్థానంలో దావా దాఖలు చేసింది.
ఇవి కూడా చదవండి
నిజానికి ‘ధురందర్’ చిత్రానికి సంబంధించి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో ఈ చిత్ర కథ మరొకరిదని వచ్చిన ఆరోపణలు సద్దుమణగక ముందే, ఇప్పుడు ఈ సాంగ్ వివాదం తెరపైకి రావడం చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది. రణవీర్ సింగ్ కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన ఈ దురంధర్ ఇప్పటికే 2 వేల కోట్ల వసూళ్ళ దిశగా వెళ్తోంది.
మరోవైపు, ఈ వివాదంపై ధురందర్ చిత్ర నిర్మాతలు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. వారు ఈ పాటను రీమిక్స్ చేశారా లేక శాంపిల్‌గా వాడుకున్నారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ కోర్టులో త్రిమూర్తి ఫిల్మ్స్ కు అనుకూలంగా తీర్పు వస్తే, ధురందర్ నిర్మాతలు భారీ జరిమానా చెల్లించడమో లేదా ఆ పాటను సినిమా నుండి తొలగించడమో చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి







