మరో 200 కోట్లు.. సరికొత్త రికార్డు దిశగా ధురంధర్ 2..!
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్(Ranveer Singh) నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ధురంధర్ 2‘ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. విడుదలైన మూడో వారం కూడా ఈ సినిమా వసూళ్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా 20వ రోజు వసూళ్లతో ఈ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచేందుకు సిద్ధమైంది. మంగళవారం అంటే 20వ రోజు ఈ సినిమా సుమారు రూ. 10.10 కోట్ల నికర వసూళ్లను సాధించింది. విశేషమేంటంటే.. సోమవారం నాటి వసూళ్లతో పోలిస్తే ఇది దాదాపు సమానంగా ఉంది.
వీక్ డేస్‌లో కూడా రెండంకెల వసూళ్లను రాబడుతుందంటే.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అందుతున్న లెక్కల ప్రకారం.. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడానికి ‘ధురంధర్ 2’ మరో రూ. 200 కోట్ల దూరంలో ఉంది. ఇప్పటివరకు ఉన్న టాప్ రికార్డులను అధిగమించడానికి ఈ సినిమాకు ఉన్న ఊపు చూస్తుంటే, అది చాలా సులభంగానే కనిపిస్తోంది. మరో వారం రోజులు ఇదే తరహా వసూళ్లు కొనసాగితే, రణవీర్ సింగ్ కెరీర్లోనే కాదు, ఇండియన్ బాక్సాఫీస్ వద్దే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా అవతరిస్తుంది.
ఇవి కూడా చదవండి
శాక్నిల్క్(Sacnilk) ప్రకారం, 20 రోజుల తర్వాత నెట్ వసూళ్లు రూ.1,033.37 కోట్లుగా ఉండగా, దేశంలో గ్రాస్ వసూళ్లు రూ.1,237.21 కోట్లుగా ఉన్నాయి. ఇది హయ్యస్ట్ గ్రాసర్ గా నిలవాలి అంటే.. ‘పుష్ప 2 ‘ దేశీయ వసూళ్లు రూ.1,234.10 కోట్లు నెట్ కలెక్షన్స్ ఉన్నందున , ‘ధురందర్ 2 ‘ రాబోయే రోజుల్లో రూ. 200.63 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఓవర్సీస్ లో, ధురందర్ 2.. 20వ రోజున రూ.4.00 కోట్లు వసూలు చేసింది, దీంతో ఇప్పటివరకు దాని మొత్తం ఓవర్సీస్ కలెక్షన్స్.. రూ.404.00 కోట్లకు చేరుకున్నాయి. దీనితో ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ.1,641.21 కోట్లకు చేరాయి
ఈ సినిమా సక్సెస్‌తో రణవీర్ సింగ్ మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రణవీర్.. ఈ సినిమాతో వందల కోట్ల క్లబ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మాస్ యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటమే ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే వీకెండ్లో ‘ధురంధర్ 2’ మరిన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవీ పోటీలో లేకపోవడం ఈ చిత్రానికి మరింత కలిసి వస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్లో కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో డాలర్లను కురిపిస్తోంది.
ఇవి కూడా చదవండి







