Dhanush: సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేయనున్న ధనుష్?
వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) రీసెంట్ గా కూలీ(coolie) సినిమాతో మరో మంచి సక్సెస్ ను అందుకున్నారు. కూలీ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమాకు మంచి కలెక్షన్లే రావడంతో సినిమా సేఫ్ అయింది. కూలీ తర్వాత జైలర్2(jailer2) ను పూర్తి చేసే పనిలో ఉన్న సూపర్ స్టార్ రీసెంట్ గా కమల్(kamal) నిర్మాతగా ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
సుందర్ సి(sundar C) దర్శకత్వంలో రజినీకాంత్ 173(rajinikanth173)వ సినిమా రానుందని, ఈ సినిమా అటు రజినీ కెరీర్లోనూ, ఇటు కమల్ బ్యానర్ లోనే మైల్ స్టోన్ ఫిల్మ్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా సుందర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే ఇప్పుడా క్రేజీ ప్రాజెక్టును ధనుష్ హ్యాండిల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
రజినీకాంత్ ను ధనుష్(dhanush) ను డైరెక్ట్ చేయబోతున్నాడని, ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ లో సినిమా రావడం ఫిక్స్ అనే అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతన్నది పక్కన పెడితే ఒకవేళ ఈ కలయిక కుదిరితే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులుండవు. డైరెక్టర్ గా ధనుష్ ఇప్పటికే పలు మంచి సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు రజినీతో సినిమా చేస్తే మాత్రం ఆ ప్రాజెక్టుపై మొదటినుంచే భారీ అంచనాలు ఉండటం ఖాయం.






