మైత్రీతో మరోసారి రాక్‌స్టార్
మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ స్పీడు ఈ మధ్య కాస్త తగగ్ఇనట్లు అనిపించినా రాక్ స్టార్ కు ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాడు. మధ్యలో కొంతకాలం తమన్ డామినేట్ చేసినట్లు అనిపించాడు కానీ ఇప్పుడు మళ్లీ డీఎస్పీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. అందులో ప్రధానంగా మైత్రీ మూవీ మేకర్స్ కు దేవీ మీద ఉన్న నమ్మకం వేరు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హీరో అజిత్ కుమార్ చేస్తున్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీనే తీసుకున్నారట. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు దేవీ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. మైత్రీతో దేవీ బంధం ఇప్పటిది కాదు. వీరిద్దరి కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ వచ్చాయి.
శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, చిత్ర లహరి, ఉప్పెన, వాల్తేరు వీరయ్య, పుష్ప1, ఇలా ఎన్నో సినిమాలు వీరి కాంబోలో మంచి హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు పుష్ప2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వాటి సరసన ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ చేరింది. ఇది కాకుండా చిత్ర లహరి2 కూడా దేవీకి వచ్చే ఛాన్సుంది. చిత్రలహరి2 ఆగిపోయిందని వార్తలొచ్చాయి కానీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.













