Devi Sri Prasad: ఆ హీరో ఎంత అడిగినా దేవీ చేయలేదట!
పుష్ప2(Pushpa2) సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండగా, మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను బీజీఎం కోసం తీసుకోవడంపై అతను చాలా హర్ట్ అయిన విషయం చెన్నైలో జరిగిన పుష్ప2 ఈవెంట్ లో తెలిసిపోయింది. కానీ తర్వాత సినిమాలో చాలా వరకు తన బీజీఎం వాడటం వల్ల చివరకు సైలెంట్ అయ్యాడు దేవీశ్రీ.
అయితే ఒకరి సినిమాలోకి మరొకరు రావడాన్ని దేవీశ్రీ ముందు నుంచి వ్యతిరేకిస్తూనే ఉండటం విశేషం. గతంలో మణిశర్మ(Manisharma)ను అతడు(Athadu) సినిమాకు అనుకున్నాక తనను అడిగితే తాను నో చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన దేవీ, ఇంద్ర(Indra)లో ఓ పాటకు అడిగినా కూడా అలా చేయడం కుదరదని చెప్పినట్లు దేవీ వెల్లడించాడు.
అంతేకాదు తన నిజాయితీని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. తమిళ స్టార్ హీరో విక్రమ్(Vikram)తో ఏఎల్ విజయ్(AL VIjay) చేయాల్సిన ఓ మూవీ కోసం తనని మ్యూజిక్ ఇవ్వమని విక్రమ్ పట్టుబట్టాడని, కానీ అప్పటివరకు విజయ్ సినిమాలన్నింటికీ జీవీ ప్రకాష్(GV Prakash) మ్యూజిక్ ఇస్తూ రావడంతో విక్రమ్ చేయనున్న సినిమాను కూడా విజయ్ జీవీతో డిస్కస్ చేశారని, విజయ్ కూడా జీవీతోనే పని చేయాలని అనుకున్నాడని తెలిసి తాను అతడితోనే కొనసాగమని విజయ్ కు చెప్పినట్టు దేవీ వెల్లడించాడు. అంతేకాదు విజయ్ కు జీవీతోనే కంఫర్ట్ అని, తనతోనే కొనసాగనివ్వాలని విక్రమ్ కు చెప్తే ఆయన షాక్ అయ్యాడని, నీకు వచ్చిన ఆఫర్ ను వేరే వాళ్లకు ఇవ్వడం గొప్ప విషయమని, నువ్వు చాలా ఎత్తుకు ఎదుగుతావని విక్రమ్ తనకు చెప్పినట్టు దేవీ వెల్లడించాడు. ఏదైనా దేవీ తన సంగీతం పట్ల కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎంతో పర్టిక్యులర్ గా ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే.













