Devi Sri Prasad: హ్యాట్రిక్ హిట్లు అందుకున్న దేవీ శ్రీ ప్రసాద్

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా ఉంటూ గత కొన్నేళ్లుగా తన మ్యూజిక్ తో ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నాడు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad). ఆయన్నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు ఇప్పటికే ప్లే లిస్టుల్లో టాప్ లోనే ఉంటాయంటే దేవీ మ్యూజిక్ స్థాయి ఏంటనేది అర్థమవుతుంది. అలాంటి దేవీ గత కొన్నేళ్లుగా మ్యూజిక్ విషయంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు. గత కొన్నేళ్లుగా దేవీ నుంచి పుష్ప(Pushpa) తప్ప ఏ సినిమాకూ పెద్దగా ఆదరణ లభించలేదు.
మధ్యలో వాల్తేరు వీరయ్య(Valtair Veerayya) లాంటి సినిమాలొచ్చినా ఆ సినిమాలకు దేవీ ఇచ్చిన మ్యూజిక్ అతని రేంజ్ లో లేదని కామెంట్స్ వినిపించాయి. అయితే మళ్లీ చాలా కాలం తర్వాత దేవీ శ్రీ ఇప్పుడు వరుస హిట్లు అందుకున్నాడు. పుష్ప2(Pushpa2), తండేల్(thandel), కుబేర(Kubera) సినిమాలతో దేవీ శ్రీ(DSP) బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుని హ్యాట్రిక్ సాధించి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.
రీసెంట్ గా రిలీజైన కుబేర(Kuberaa) సినిమా చూశాక ఆడియన్స్ ధనుష్(dhanush), నాగార్జున(nagarjuna) నటనతో పాటూ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి కూడా తెగ మాట్లాడుకుంటున్నారు. సినిమాలోని ఎమోషన్ ను దేవీ మ్యూజిక్ సరిగ్గా క్యారీ చేసిందని, తన బీజీఎంతో కుబేర ను నెక్ట్స్ లెవెల్ ను తీసుకెళ్లాడని దేవీకి ప్రశంసలు అందుతున్నాయి. ఏదేమైనా దేవీ మొత్తానికి హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం దేవీ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath Singh) తో పాటూ జూనియర్(Junior) అనే సినిమాలు చేస్తున్నాడు.