Ajith: లైఫ్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith). కెరీర్ మొదట్లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న అజిత్, ఆ తర్వాత మాస్ హీరోగా మారారు. ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న అజిత్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రేసింగ్ లో తనదైన సత్తా చాటుతున్నారు.
అజిత్ ఇండస్ట్రీలోకి వచ్చి 33 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ ఓ నోట్ ను షేర్ చేశారు. 33 ఏళ్ల కెరీర్లో తాను ఈ స్థాయికి అంత ఈజీగా రాలేదని, ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పడటంతో పాటూ ఎత్తు పల్లాలను చూశానని ఎమోషనల్ అయ్యారు. అన్ని సమయాల్లో ఫ్యాన్స్ అండగానే ఉన్నారని, సినిమాలు హిట్టైనా, ఫ్లాపైనా ఫ్యాన్స్ మాత్రం తనకెప్పుడూ తోడుగానే ఉన్నారని, వారికెలా థ్యాంక్స్ చెప్పాలో తనకు తెలియడం లేదన్నారు అజిత్.
కెరీర్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వాటిని తట్టుకుని ధైర్యంగా నిలబడ్డానని, ఎన్ని జరిగినా పట్టుదలను మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టింది లేదని, మూవీస్ చేస్తూనే మోటార్ రేసింగ్ లో కూడా పాల్గొంటూ వచ్చానని, అక్కడ కూడా తనపై ఎన్నో కుట్రలు జరిగాయని కానీ వాటన్నింటినీ తిప్పి కొట్టి లైఫ్ లో గెలిచానని, ఈ జర్నీలో తన భార్య(shalini) కూడా తనకెంతో సహకరించిందని, దేశానికి రేసింగ్ లో మరిన్ని మెడల్స్ తీసుకొస్తానని తన నోట్ లో రాసుకొచ్చారు.