ఛపాక్ …నా జీవితంలో అత్యంత విలువైన చిత్రం
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం ఛపాక్. ప్రధాన పాత్రలో బాలీవుడ్ నాయిక దీపికా పదుకొణె నటిస్తోంది. వెండితెర ప్రపంచంలో అందాల తారగా వెలిగిపోతన్న తరుణంలో ఇలాంటీ డీ గ్లామర్ పాత్ర చేయడంపై దీపికాకు ప్రశంసలు వెల్తువెత్తాయి. మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విక్రాంత్ మెస్సే, మేఘనా గుల్జార్లతో దిగిన ఫొటోను దీపికా సామాజిక మాధ్యమాల్లో పంచుకొంది. ఛపాక్ నా జీవితంలో అత్యంత విలువైన చిత్రం. 2020లో మీ ముందుకు వస్తుందని దీపిక పేర్కొంది.













