విజయ్ డీ ఏజింగ్ కోసం అంత ఖర్చా?
ఏదైనా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో సీనియర్ హీరోలు నటించాల్సి వస్తే, వాళ్ల వయసు తగ్గించేందుకు డైరెక్టర్లు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఏవో కొత్త టెక్నాలజీలు వాడి ట్రై చేస్తారు కానీ అవి సక్సెస్ రేటు కంటే కూడా డిజాస్టర్ రేట్సే ఎక్కువ. ఆచార్యలో చిరంజీవి టైగర్ నాగేశ్వరరావులో రవితేజ ఇలా ప్రయోగాలు చేసే ట్రోల్స్ కు గురయ్యారు.
కానీ నిర్మాతలు రాజీ పడకుండా బడ్జెట్ పెడితే ఇదేమీ పెద్ద కష్టం కాదని తెలుస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన 68వ సినిమా చేస్తున్న విజయ్ ఆ సినిమాలో కాసేపు 19 ఏళ్ల కుర్రాడిలా కనిపించాల్సిన అవసరముందట. దీని కోసం డీ ఏజింగ్ టెక్నిక్ ను వాడనున్నారు. ఆ టెక్నాలజీ కోసం ఏకంగా నిర్మాతలు రూ.6 కోట్లు ఖర్చు పెట్టనున్నారట.
సై ఫై జానర్ లో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో స్టోరీ ట్రీట్మెంట్ తో పాటూ స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉండబోతుందట. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా టైటిల్ను ఇంకా ప్రకటించలదు కానీ ఇది కూడా మానాడు టైప్ లో ఉంటుందని కానీ టైం ట్రావెల్ సినిమా కాదని అంటున్నారు.













