Daku Maharaj Review: బాలకృష్ణ నట విశ్వరూపం ‘డాకు మహారాజ్’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5
నిర్మాణ సంస్థ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, సచిన్ కేద్కర్, శ్రద్ధా శ్రీనాథ్, రిషీ, రవి కిషన్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బేబీ వేద అగర్వాల్ తదితరులు
సంగీతం: తమన్ ఎస్, సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్
కళా దర్శకుడు: అవినాష్ కొల్ల
ఎడిటింగ్ : నిరంజన్ దేవరమానే, రూబెన్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: బాబీ కొల్లి
విడుదల తేది : 12.01.2025
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద హిట్టు మీద హిట్టు ఖాతాలో వేసుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బాలయ్య మార్క్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఈ మూడు సినిమాలు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులను సైతం మెప్పించి కలెక్షన్ల విషయంలో అదరగొట్టాయనే సంగతి తెలిసిందే. దర్శకుడు బాబీ, సితార నిర్మాత నాగవంశీలతో డాకు మహారాజ్ గా బాలకృష్ణ ఈ రోజు 12న థియేటర్లోకి వచ్చారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆల్రెడీ డాకు మహారాజ్‌కు మంచి టాక్ వస్తోంది. డాకు మహారాజ్ మీద నెటిజన్లు స్పందిస్తున్నారు.అసలు సినిమా మీద టాక్ ఎలా నడుస్తోందో ఓ సారి సమీక్షలో చూద్దాం.
కథ :
1996 లో మదన పల్లె లో ఓ గురుకుల పాటశాల నడుపుతూ ఉంటాడు కృష్ణ మూర్తి (సచిన్ కేద్కర్)(SACHIN KEDHKAR) అతని మనవరాలు వైష్ణవి (బేబీ వేద అగర్వాల్) అనుకోకుండా లోకల్ MLA (రవి కిషన్) అతన్ని తమ్ముడు మనోహర్ నాయుడు (సందీప్ రాజ్ ) వలన చిక్కుల్లో పడుతుంది. ఈ విషయం తెలిసి భోపాల్ జైలు నుండి తిహార్ జైలు కు బదిలీ అవుతున్న సమయం లో ఖైదీ సీతారామ్(బాలకృష్ణ) తఃప్పించుకుని వచ్చి నానాజీ పేరుతో వైష్ణవి ఇంటిలో డ్రైవర్ గా చేరుతాడు. అయితే MLA వెంటేవుంటూ కొకైన్ పండిస్తున్న చోట ఠాకూర్ కుటుంభాన్ని అంతమోదించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న ఇరిగేషన్ ఇంజనీర్ సీతారాం మరియు అతని భార్య (ప్రగ్యా జైశ్వాల్)(PRAGYA JAISWAL) కొన్ని కారణాల వల్ల ఠాకూర్(రిషి) ఫ్యామిలీ నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటాడు. మైనింగ్ కింగ్ (బాబీ డియోల్) సీతారాంను తన స్వార్థం కోసం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎదురించడానికి సీతారామ్ డాకు మహారాజ్ గా ఎందుకు మారారు? బాలయ్య పోషించిన మరో పాత్ర నానాజీ ఎవరు? జైలు నుండి తప్పించుకుని వైష్ణవి ని కాపాడటానికి గల కారణం ఏమిటి? డాకు మహారాజ్ చివరకు తన లక్ష్యాలను సాధించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
నటీనటుల హావబావాలు :
బాలకృష్ణ(NANDAMURI BALAKRISHNA) నానాజీగా , ఇటు డాకు మహారాజ్ పాత్రలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పించాడు.అయన నటన గురించి ప్రత్యేకంగా, కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది యాక్టింగ్ డబిడి దిబిడే…బాబీ డియోల్ మైనింగ్ కింగ్ గా తన పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. డాకు మహారాజ్ తర్వాత బాబీ డియోల్(BOBBY DEOL) కు తెలుగులో మరిన్ని మూవీ ఆఫర్లు వచ్చినా ఏ మాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలకు మరీ ఎక్కువగా ప్రాధాన్యత లేకపోయినా వాళ్లు తన రోల్స్ కు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు:
మాస్ యాక్షన్ మెయిన్ పాయింట్ గా కధలు రాసుకునే దర్శకుడు బాబీ (DIRECTOR BOBBY) ఎంచుకున్న కధ కొత్తది కాకపోయినా…కొత్త ప్రమాణాలతో తీసి తన మేకింగ్ ను ఉన్నత స్తాయికి తెసుకెళ్లాడు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మాటలు ప్రదాన బలం భాను బోగావరపు,(BHANU BOGARAPU) నందు (NANDU) సంభాషణలు విశేషంగా ఆకట్టుకుంటాయి. సింహం నక్కల మీదకొస్తే వార్ కాదు! వార్నింగ్ వాడు ఇవ్వాలి చచ్చేవాడు కాదు.బాలకృష్ణ కే సొంతం అన్నటు వుండే డైలాగ్స్ వినిపిస్తాయ్. బీజీఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో తనకు ఎవరూ సాటిరారని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అఖండ వారసత్వాని.. మరోసారి బాలయ్య తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సినిమాకు సెకండ్ హీరో ఎవరైన ఉంటే అది కచ్చింతంగా థమన్ (SS THAMAN) అనే చెప్పాలి. ఎడిటర్స్ రూబేన్,(EDITOR RUBEN) నిరంజన్ దేవరమానే(NIRANJA DEVARAMANE) పనితీరు బాగున్నాయి. నిర్మాత నాగవంశీ (SURYA DEVARA NAGAVAMSI)ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు. థమన్ ఈ సినిమాతో మరో మెట్టు పైకి ఎదిగారు.
విశ్లేషణ :
ఫస్టాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు ఉండగా ఫస్టాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సీనియర్ హీరో బాలయ్యను వయస్సుకు తగ్గ పాత్రలో చూపించడంతో పాటు ప్రేక్షకులను మెప్పించే విషయంలో బాబీ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. సంక్రాంతి పండుగకు ఫ్యామిలీతో కలిసి మంచి మాస్ సినిమా చూడాలని భావించే ప్రేక్షకులకు డాకు మహారాజ్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.బాలయ్య సినిమాలు అంటే ప్రేక్షకులు కచ్చితంగా కొన్ని అంశాలను ఆశిస్తారు. డైలాగ్స్ అద్భుతంగా ఉండాలని, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ఉండాలని, కళ్లు చెదిరే ఎలివేషన్ సీక్వెన్స్ లు కావాలని ఫీలవుతారు. ఇవి కోరుకుని సినిమా చూసే అభిమానులను డాకు మహారాజ్ ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని చెప్పవచ్చు. బాలయ్య గత సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంది.