‘కరోనా వైరస్’ మూవీ ట్రైలర్ విడుదల – లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన వర్మ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంటే రామ్‌గోపాల్‌వర్మ మాత్రం `కరోనా వైరస్` అనే టైటిల్‌తో ఏకంగా సినిమానే తీసేశాడు. తన మిత్రుడు అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో కుటుంబంలోని ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు కనబడితే మిగతా వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశాలు ఈ ట్రైలర్లో కనిపించాయి. అయితే ఎప్పటిలాగే ఒక హారర్ సినిమాకి, ఒక థ్రిల్లర్ సినిమాకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తారో అలాంటి మ్యూజిక్ ఈ సినిమాకి చేశారు. ఈ ట్రైలర్ చివరలో తెలంగాణ సిఎం కెసీఆర్, ఎపి సిఎం వై.ఎస్.జగన్ వాయిసెస్ వినిపించడం గమనార్హం. `పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది` అని కేసీఆర్ చెప్పడం, `దాని మీద బ్లీచింగ్ పౌడర్ చల్లితే…` అని వై.ఎస్.జగన్ మాటలు వినిపిస్తాయి. చివరలో `ప్రపంచంలోనే కరోనా వైరస్‌పై తీసిన తొలి సినిమా` అని వేశారు. `షూటింగ్ అంతా లాక్డౌన్ సమయంలోనే జరిగింది` అని వేయడం కొసమెరుపు.
లాక్డౌన్ నిబంధనల వల్ల దేశవ్యాప్తంగా షూటింగులు ఆగిపోయాయి. ఈమధ్య కొన్ని రాష్ట్రాలు షూటింగులకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చాయి. మన తెలుగు రాష్ట్రాల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. త్వరలోనే షూటింగ్‌కి కూడా నిబంధనలతో కూడిన అనుమతులిస్తారని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే లాక్డౌన్ సమయంలోనే షూటింగ్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ట్రైలర్ కూడా విడుదల చేశారంటే రామ్‌గోపాల్‌వర్మ ధైర్యానికి మెచ్చుకోవాలి. అయితే ఇప్పుడు వర్మ లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించినట్టే కదా. వర్మ మీదే కాదు, ఆ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతికనిపుణులు అందరూ శిక్షార్హులే అవుతారు. మరి ఈ సినిమా విషయంలో, ఈ సినిమా యూనిట్ విషయంలో ప్రభుత్వం, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.













