Coolie: ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న కూలీ

సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కూలీ(Coolie). భారీ స్టార్ క్యాస్టింగ్ తో ఎన్నో అంచనాలతో వచ్చిన కూలీ అంచనాలను అందుకోలేకపోయింది. కోలీవుడ్ నుంచి రాబోయే ఫస్ట్ రూ.1000 కోట్ల సినిమాగా రిలీజ్ కు ముందు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తమిళ ఆడియన్స్. వారందరికీ కూలీ నిరాశనే మిగిల్చింది.
రిలీజ్ తర్వాత కూలీ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది. కానీ టాక్ ఎలా ఉన్నా కూలీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లు వసూళ్లు దక్కాయి. ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కు ఇప్పుడో గుడ్ న్యూస్. కూలీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ ను ఓటీటీ సంస్థ అనౌన్స్ చేసింది.
కూలీ సినిమా సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నట్టు వెల్లడిస్తూ ఓ పోస్ట్ చేసింది సదరు ఓటీటీ సంస్థ. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూలీ సినిమా సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రైమ్ వీడియో తెలిపింది. నాగార్జున(nagarjuna) విలన్ గా నటించిన ఈ సినిమాలో ఆమిర్ ఖాన్(Aamir khan), సౌబిన్ షాహిర్(Soubin Shahir), ఉపేంద్ర(Upendra), సత్యరాజ్(Satyaraj), శృతి హాసన్(Shruthi Hassan) కీలక పాత్రల్లో నటించారు.