కమెడియన్ పృథ్వీకి కీలక పదవి
హాస్య నటుడు పృథ్వీరాజ్‌కు ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వంలో పదవి లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన పృథ్వీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవి ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌కు (ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమించారు. పృథ్వీకి కీలక పదవి కట్టబెట్టడంతో మిగిలిన వైసీపీ మద్దతుదారులైన సినీ పరిశ్రమకు చెందిన కొందరు తమకు కూడా ఏదైనా పదవి దక్కుతుందేమోననే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ హయాంలో శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ చైర్మన్‌గా రాఘవేంద్రరావు ఉన్నారు. అయితే వైసీపీ అధికారంలో వచ్చిన వెంటనే ఆయన గౌరవ ప్రదంగా ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఇదే రంగానికి చెందిన పృథ్వీకి చైర్మన్ పదవి ఇవ్వడం గమనార్హం.













