సోషల్ మీడియాలో పుకార్లు నమ్మకండి ఈ విపత్తు కారణంగా ఇంట్లోనే ఉంటున్నాను -బ్రహ్మానందం
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో అనేక రకాల పుకార్లు చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. ఆయనకు సినిమాలలలో అవకాశాలు తగ్గాయని, బిగ్ స్క్రీన్ కి గుడ్ బై చెప్పి సీరియల్స్ లో వెబ్ సిరీస్ లో నటించనున్నట్టు రకరకాల కథనాలు రావడం అందరిని షాక్ కి గురి చేశాయి. ఇకపోతే ఆ రూమర్స్ డోస్ ఎక్కువవడంతో చివరకు బ్రహ్మానందం వివరణ ఇవ్వక తప్పలేదు. సెలబ్రిటీస్ పైన సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించడం కామన్ గా మారిపోయింది. ప్రతి విషయంపై స్పందిస్తే.. నా సమయం సరిపోదని అప్పట్లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ సీనియర్ కమెడియన్. గత ఏడాది వరకు కొంత బిజీగా ఉన్న బ్రహ్మానందం ఈ సంవత్సరం అల వైకుంఠపురములో…రాములో రాములో సాంగ్ లో గెస్ట్ అప్పిరియన్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేవలం ఒక స్టెప్పుతో కనిపించి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. 1000కి పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందం ఈ స్థాయిలో వెండితెరకు ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదు. బ్రహ్మానందం గత కొంత కాలంగా వెండితెరకు చాలా దూరంగానే ఉంటున్నాడు. రెగ్యులర్ పాత్రలు బోర్ కొట్టేయడంతో కొన్ని సినిమాలను కూడా రిజెక్ట్ చేశాడని టాక్ వచ్చింది ఇక ఫైనల్ గా ఆయన కెరీర్ పై వస్తున్న రూమర్స్ గురించి స్పందించారు.
“తనపై ఎవరో కావాలనే పుట్టించిన తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు అనిపిస్తోంది. ఈ నిమిషం వరకు వస్తున్న వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదు. చాలా మంది నాకు ఫోన్ చేసి సినిమాలు మానేసి సీరియల్స్ లోకి వస్తున్నారంటగా అంటూ ఫోన్ చేశారు. వాళ్ళు అలా అడగటంతో ఆ విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏ సీరియల్ వాళ్ళు నన్ను సంప్రదించలేదు, నను ఎవరితో ఆ విషయంపై మాటలాడలేదు నేను చెప్పని మాటలను కూడా ఈ విధంగా ప్రచారం చేయడం ఎలా సాధ్యం అవుతుందో నాకు అర్థం కావడం లేదు. నా పరిచయం వున్నవాళ్ళు ఫోన్లు చేసి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను.
దయ చేసి ఎలా తప్పుడు వార్తలు సృటించి మా జీవితాలతో ఆడుకోకండి. ఇక ఈ లాక్ డౌక్ సమయం లో నేను కాలు బయటపెట్టకుండా ఇంట్లోనే ఉంటున్నాను. నేనొక్కడినే కాదు యావత్ తెలుగు సినిమా నటి నటులందరూ దాదాపు మూడు నెలల నుంచి బయటకు వెళ్లడం లేదు. మరికొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉంటే బెటర్ అనే ఉద్దేశ్యంతో పుస్తకాలతోనే సమయాన్ని గడిపేస్తున్నా. భగవత్గీత, ఖురాన్ వంటి పవిత్ర గ్రంధాలను చదివి మంచి విషయాల గురించి తెలుసుకుంటున్నాను.అప్పడుప్పుడు నా మనవడితో కూడా ఆడుకుంటున్నా, హరితహరమ్ లో భాగంగా మొక్కలు కూడా నాటడం జరిగింది. నేను సినిమాలు చేస్తానో.. సీరియల్స్ చేస్తానో..ఈ క్రైసన్ సద్దుమణిగిన తరువాత మున్ముందు మీకే తెలుస్తుంది” అంటూ బ్రహ్మానందం వివరణ ఇచ్చాడు.













