Theatre: ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలివే!
ఏప్రిల్ మొదటివారం అన్నీ చిన్న సినిమాలే రిలీజయ్యాయి. స్టార్ హీరో సినిమా ఒక్కటి కూడా గత వారం రిలీజ్ కాలేదు. ఈ వారం ఆ లోటును తీరుస్తూ పలు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు ముస్తాబయ్యాయి. అందులో మొదటిగా అజిత్(Ajith), త్రిష(Trisha) జంటగా అధిక్ రవిచంద్రన్(Adhik ravuchandran) దర్శకత్వంలో తెరకెక్కిన గుడ్ బ్యాడ్ అగ్లీ(Good bad ugly) సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) హీరోగా, తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో రూపొందిన జాట్(Jaat) సినిమా కూడా ఏప్రిల్ 10నే రిలీజ్ అవుతోంది. సిద్దూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), వైష్ణవి చైతన్య(Vyshnavi Chaitanya) జంటగా బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar)దర్శకత్వంలో తెరకెక్కిన జాక్(Jack) సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాంకర్ ప్రదీప్(Pradeep) హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkada Ammayi Ikkada abbayi) ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు నితిన్(Nithin), భరత్(Bharath) కలిసి దర్శకత్వం వహించారు.
వీటితో పాటూ రాజేష్(Rajesh), శ్రావణి(Sravani)జంటగా స్వామి పట్నాయక్(Swami Patnaik) దర్శకత్వంలోని రూపొందిన కౌసల్య తనయ రాఘవ(Kausalya Thanaya Raghava) ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది. మమ్ముట్టి(Mammootty) హీరోగా వస్తోన్న మలయాళ మూవీ బజూక(Bajuka) ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంటే, గిప్పీ గ్రేవాల్(gippy greval, గురుప్రీత్(Gurupreeth) ప్రధాన పాత్రల్లో రూపొందిన అకాల్(Akaal) పంజాబీ, హిందీ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది. బాలీవుడ్ నుంచి జ్యోతిరావు పూలే(Jyothirao Poole) బయోపిక్ గా పూలే(Poole) మూవీ ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమాల్లో ఏయే సినిమాలు ఆడియన్స్ ను మెప్పిస్తాయో చూడాలి.













