Viswambhara: చిరూ పారితోషికమెంత?

పదేళ్ల పాటూ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) టైర్1 హీరోల లిస్ట్ లోనే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వశిష్ట(Vasishta) దర్శకత్వంలో విశ్వంభర(Viswambhara) అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్(UV creations) నిర్మిస్తోంది. అయితే విశ్వంభరకు మెగాస్టార్ చిరంజీవి రూ.60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చిరంజీవి దసరా(Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టును చిరూ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశాడు. సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri), నాని(Nani) సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు చిరంజీవి రూ. 75 కోట్లు తీసుకోనున్నాడట. శ్రీకాంత్ సినిమాతో పాటూ చిరంజీవి అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.
ఆ సినిమాకు కూడా చిరూ రూ. 75 కోట్లకు పైగా పారితోషికాన్ని అందుకోబోతున్నాడట. విశ్వంభర తర్వాత చిరూ చేయబోయే సినిమా అనిల్‌తోనే అని సమాచారం. చిరూ నెక్ట్స్ అనిల్, శ్రీకాంత్ తో చేయబోతున్న రెండు సినిమాలూ కమర్షియల్ గా వర్కవుట్ అయితే ఆ తర్వాతి సినిమాలకు రూ. 100 కోట్లు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా టాలీవుడ్ లో సీనియర్ హీరోల్లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు.