హోమియో కాలేజీకి మెగాస్టార్ రూ. కోటి విరాళం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో కాలేజీ అభివృద్ధికి ఆయన అల్లుడు మెగాస్టార్ కోటి రూపాయలు అందజేయనున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ తెలిపారు. చిరంజీవి నివాసంలో కలిసిన ఎంపీ మాగంటి మురళీమోహన్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖలకు పుష్పగుచ్చంలు అందజేసి శభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరం హోమియో కాలేజీ అభివృద్ధికి దాతలు సహాకారం అందించడం ద్వారా కళాశాల మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు కావడంతో ఎంపీ మురళీమోహన్ ఆమెను కూడా లుసుకుని పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.













