‘గాడ్ ఫాదర్’ సెట్ లో మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న గాడ్ ఫాదర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లపై సన్నివేశాలను మార్చి 12 నుంచి చిత్రీకరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కంటిన్యూ గా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాల్లో గాడ్ ఫాదర్ ఒకటి. మలయాళ చిత్రం లూసిఫర్‌కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన రాజా దర్శకుడు. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు..గాడ్ ఫాదర్లో సల్మాన్ నటిస్తున్నారంటే సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమాను బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నారేమో రిలీజ్ సమయంలో తెలియనుంది. చిరంజీవి, సల్మాన్ ఖాన్ మధ్య కొన్ని సన్నివేశాలను ముంబైలోని స్టూడియోలో చిత్రీకరించారు.
ఓ పాట, కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిరంజీవి, సల్మాన్‌పై చిత్రీకరించే అవకాశం ఉందని సమాచారం. చిరంజీవికి, సల్మాన్ ఖాన్ల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. దాంతో ఆయన్ని సల్మాన్ తన ఫామ్‌హౌస్‌లోనే ఉంచి అతిథి మర్యాదలు చేస్తున్నారని సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న న్యూస్. ఇప్పటికే చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఆచార్య సినిమా షూటింగ్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 29న రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న భోళా శంకర్, డైరెక్టర్ బాబి తెరకెక్కిస్తోన్న మరో చిత్రం సెట్స్‌పై ఉన్నాయి. మరో వైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయడానికి ఇప్పటికే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇలా క్షణం తీరిక లేకుండా సినిమాలను ప్లాన్ చేసుకున్నారు మెగాస్టార్.













